brochevarevaru ra
పల్లవి
బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా నను1నీ చరణాంబుజములఁ నే విడజాల కరుణాలవాల
అనుపల్లవి
ఓ చతురాననాది వ౦దిత నీకు పరాకేలనయ్య నీ చరితమునుఁ పొగడలేని నా చి౦తఁదీర్చి వరములిచ్చి వేగమె
చరణం
సీతాపతే నాపై నీకభిమానము లేదా వాతాత్మజార్చితపాద నా మొరలను వినరాదా ఆతురముగఁ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవుఁగదా నా పాతకమెల్లఁ పోగొట్టి గట్టిగఁ నా చేయిఁబట్టి విడువక నను