Logo

maa janaki cheta pattaga

పల్లవి

మా జానకి చెట్ట పట్టగ మహరాజవైతివి

అనుపల్లవి

రాజ రాజ వర రాజీవాక్ష విను రావణారియని రాజిల్లు కీర్తియు (మా)

చరణం

కానకేగి ఆజ్ఞ మీరక మాయాకారమునిచి శిఖి చెంతనేయుండి దానవుని వెంటనే చని అశోక తరు మూలనుండి వాని మాటలకు కోపగించి కంట వధియించకనేయుండి శ్రీ నాయక యశము నీకే కల్గ జేయ లేదా త్యాగరాజ పరిపాల (మా)

© 2025 All rights reservedBuilt with Flowershow Cloud

Built with LogoFlowershow Cloud